దారకొండలో ఉచిత మెగా వైద్యశిబిరం

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు పరిధిలోని జికె వీధి మండలం దారకొండలో ఫిబ్రవరి 28, 2026న ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు వరప్రసాద్ తెలిపారు. గీతం మెడికల్ కాలేజీ సహకారంతో ఏర్పాటు చేస్తున్న ఈ శిబిరంలో చిన్నపిల్లల వైద్యులు, గైనకాలజిస్ట్, ఆర్థోపెడిక్, ఆప్తమాలజిస్ట్, చర్మవ్యాధి నిపుణులు పాల్గొంటారు. దారకొండ, దుప్పిలివాడ, సీలేరు పంచాయతీ పరిధి గ్రామస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వైద్య పరీక్షలు, మందుల పంపిణీ ఉచితంగా జరుగుతాయని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్