జీ.మాడుగుల: భారీ వర్షాలకు కూలిన కళామందిరం

ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జీ.మాడుగుల మండల కేంద్రంలోని కళామందిర భవనం కూలిపోయింది. నుర్మతి-మద్దిగరువు గ్రామానికి వెళ్లే రహదారి మధ్యలో సూరిమెట్ట వద్ద ఉన్న సీపీ అప్రోచ్ ర్యాంప్ దెబ్బతింది. జీఎం కొత్తూరు-జోగులపుట్టు రోడ్డు మధ్యలో ఉన్న కల్వర్టు అడుగుభాగం కూడా కొట్టుకుపోయింది. దీంతో ఆయా మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు ప్రమాదాల పట్ల ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్