విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై లేకుండా చారిత్రాత్మక నిర్ణయాలు

రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. గత పాలనలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెరిగి రూ. 32 వేల కోట్ల భారం పడిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ట్రూఅప్ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ యూనిట్‌కు 13 పైసలు తగ్గించిందని, అక్వా రైతులకు యూనిట్ ధరను రూ. 1. 50కి తగ్గించడంతో పునరుత్పాదక శక్తికి ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్