ఐఏఎస్ దంపతులకు ఒకే ప్రాంతంలో పోస్టింగ్ కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పాడేరు ఐటీడీఏ పీవోగా ఉన్న తిరుమాని శ్రీపూజను జాయింట్ కలెక్టర్‌గా నియమించింది. ఆమె భర్త ఆదిత్యవర్మను ఐటీడీఏ పీవోగా పోస్టింగ్ ఇచ్చింది. ఇటీవల వివాహం చేసుకున్న ఈ దంపతులు వేర్వేరు క్యాడర్లలో పనిచేస్తున్నారు. మేఘాలయ క్యాడర్‌కు చెందిన ఆదిత్యవర్మను ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేసిన ప్రభుత్వం, ఇద్దరూ కలిసి పనిచేసేలా ఈ నియామకాలు చేపట్టింది.