కొయ్యూరు: 'పిల్లల లోటుపాట్లు పరిష్కరించాలి'

విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను తల్లిదండ్రులు తప్పనిసరిగా పరిశీలించాలని కొయ్యూరు ఎంపీడీవో ప్రసాదరావు సూచించారు. రాజేంద్రపాలెం కేజీబీవీ పాఠశాలలో ప్రిన్సిపాల్ పరిమళ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన పీటీఎం కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్లల లోటుపాట్లు గుర్తించి ఉపాధ్యాయులతో చర్చించి పరిష్కరించాలని సూచించారు. అనంతరం ఏటీడబ్ల్యూవో క్రాంతి కుమార్‌తో బాలికల ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలోనూ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్