గ్రామాల్లో పారిశుద్ధ్య పరిరక్షణ చర్యలపై సర్వే నిర్వహించి దాని ఆధారంగానే పంచాయతీలకు ర్యాంకులు ఇవ్వడం జరుగుతుందని స్వచ్ఛ సర్వేక్షన్ కేంద్ర బృంద సభ్యుడు హేమంత్ కుమార్ తెలిపారు. గురువారం కొయ్యూరు మండలంలోని బూదరాళ్ల పంచాయతీ పరిధి గరిమండ బాలరేవుల నూకరాయితోట, బూదరాళ్ల గ్రామాల్లో స్వచ్ఛ సర్వేక్షన్ కేంద్ర బృంద సభ్యులు పర్యటించారు. గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షన్ 2025 కార్యక్రమంలో భాగంగా పంచాయతీలో పర్యటించింది.