డుంబ్రిగూడ, అరకు, పాడేరు ప్రాంతాల్లో పనస పండ్ల సీజన్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. సహజసిద్ధంగా, ఎలాంటి రసాయనాలు లేకుండా పండే మన్యం పనస పండ్లు వాటి తియ్యటి రుచి, సువాసనతో వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నాణ్యతలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ పనస తొనలు స్థానిక వారపు సంతల్లో మంచి డిమాండ్‌ను సొంతం చేసుకుంటున్నాయి. మన్యం పనస ప్రత్యేక రుచి కారణంగా స్థానికులతో పాటు పర్యాటకులు కూడా వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.