పాడేరు: మౌలిక సౌకర్యాలు మెరుగుపరచాలి

ఏజెన్సీ ప్రాంతంలోని విద్యాసంస్థలలో మౌలిక సౌకర్యాలు మెరుగుపరచాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జీవనకృష్ణ అధికారులను డిమాండ్ చేశారు. స్థానిక ఎస్ఎఫ్ఎ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పాడేరు ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి ఆశ్రమ, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని పూర్తి స్థాయి నోటు పుస్తకాలు ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్