ఈనెల 11న జిల్లాలో ఇద్దరు మంత్రులు పర్యటించినున్నారని వారి పర్యటనకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులకు గురువారం ఆదేశించారు. ఈ సందర్భంగా వ్యవసాయం, ఉద్యానవన శాఖ, పర్యాటకం, మహిళా శిశు సంక్షేమం, పేదరిక నిర్మూలన పీ - 4పై జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి గుమ్మడి సంధారాణి సమీక్షిస్తారన్నారు. అనంతరం హోం మంత్రి వంగల పూడి అనితతో కలిసి స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారని అన్నారు.