అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, మిడ్ డే మీల్స్ కార్మికులు, వెలుగు వీవోఏలపై రాజకీయ నేతలు వేధిస్తే ఊరుకోమని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చిన్నయ్య పడాల్ తెలిపారు. పాడేరులో శనివారం జరిగిన సీఐటీయూ సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ స్థాయిలో కొంతమంది నేతలు వర్కర్లను వేధిస్తున్నట్టు తమకు సమాచారం వచ్చిందన్నారు. ఈ పరిస్థితి మారకపోతే ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.