పాడేరు మండలంలోని మినుములూరులో శుక్రవారం పింఛన్ల పండుగ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ్ పాల్గొని ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు. పింఛన్లు అందుతున్న తీరును లబ్ధిదారుల వద్ద తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా పింఛన్ల పండగ జరుగుతోందని, ఈ నెలలో జిల్లాలో 1,824 మందికి కొత్తగా స్పాస్ పెన్షన్లు మంజూరు చేసినట్లు తెలిపారు.