అల్లూరి జిల్లాలో ఐదు రోజుల పాటు వర్షాలు

అల్లూరి జిల్లాలో రానున్న ఐదు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. పాడేరు, చింతపల్లి, అరకు డివిజన్ల పరిధిలో జూన్ 3 వరకు కనిష్ఠంగా 4.8 మిల్లీమీటర్లు, గరిష్ఠంగా 15 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రైతులు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ పనులు చేపట్టాలని సూచించారు.

సంబంధిత పోస్ట్