లంబసింగిలో రాకాసమ్మ ఉత్సవాలు ముగింపు

‘ఆంధ్ర కాశ్మీర్’గా ప్రసిద్ధి చెందిన లంబసింగిలో గ్రామదేవత రాకాసమ్మ అమ్మవారి ఉత్సవాలు మూడు రోజుల పాటు ఆధ్యాత్మిక శోభతో అంగరంగ వైభవంగా ముగిశాయి. మంగళవారం అమ్మవారిని గ్రామ పురవీధుల్లో ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం తెల్లవారుజామున చిన్న బుడ్డి, ఎర్రిబుడ్డ, పెద్ద బుడ్డి ప్రతిమలతో భక్తులు ఆధ్యాత్మిక నృత్యాలు ప్రదర్శించారు. భక్తుల జైజైధ్వానాలు, సంప్రదాయ వేడుకల మధ్య ఉత్సవాలు ఘనంగా ముగిశాయి.

సంబంధిత పోస్ట్