సంక్రాంతి పండుగ సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అదనపు ఎస్పీ నవజ్యోతి మిశ్రా హెచ్చరించారు. శనివారం ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాల్లో కోడిపందాలు, పేకాట, చిత్తులాట వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించినా, పాల్గొన్నా కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఇలాంటి ఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.