పాడేరులోని ఉమా నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో జూలై 14న రాజరాజేశ్వరి అమ్మవారిని శాకంబరిగా అలంకరించనున్నారు. ఈ మేరకు ఆలయ ధర్మకర్త కొత్తగుల్లి సింహాచలం నాయుడు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అలంకారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి ఉప్పల వెంకటరత్నం, ఉపాధ్యక్షుడు కొత్తగుల్లి రామారావు, ఆధ్యాత్మిక సేవా సభ్యులు పాల్గొన్నారు.