నేటి కూటమి ప్రభుత్వం రాజ్యాంగ పాలనను పక్కనపెట్టి రెడ్ బుక్ పాలనను కొనసాగిస్తోందని వైసీపీ ఎమ్మెల్సీ వరూధి కళ్యాణి విమర్శించారు. అల్లూరి జిల్లా పాడేరులో జరిగిన జిల్లా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, గ్రామ పంచాయితీ స్థాయిలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే సమావేశం ఉద్దేశమని తెలిపారు. ఈ సమావేశానికి వైసీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు అధ్యక్షత వహించారు.