మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 23న అల్లూరి జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించనున్నట్లు సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పోతురాజు తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, లేనిపక్షంలో అప్పులు చేసి పిల్లలకు ఆహారం వండాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.