నాలుగు రోజులుగా కురుస్తున్న తుఫాను కారణంగా పాడేరు మండలంలోని తుమ్మల పాలెం, ములగల పాలెం, అర్జాపురం గ్రామాలకు చెందిన గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గరికిబండ వద్ద ఏరు దాటితేనే బయటకు వచ్చే పరిస్థితి ఉన్నా, ప్రస్తుతం వరద ఉధృతి కారణంగా అది అసాధ్యంగా మారింది. దీంతో, గిరిజనులు కర్రలతో తాత్కాలిక వంతెనను నిర్మించుకుంటున్నారు. తమ దుస్థితిని పట్టించుకునేవారు లేరని, ప్రత్యామ్నాయ మార్గం చూపాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.