విశాఖ: లారీ, బైక్ ఢీ.. వ్యక్తికి గాయాలు

విశాఖలోని కూర్మన్నపాలెంలో శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. జంక్షన్ సమీపంలో లారీ, బైక్ ఢీకొన్నాయి. బైక్ నడుపుతున్న వ్యక్తి అప్రమత్తమై పక్కకు దూకడంతో ప్రాణాపాయం తప్పింది. వ్యక్తికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ  ఘటనలో బైక్ పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్