మహిళా భద్రత మన బాధ్యత

బుధవారం ముంచంగిపుట్టు మండలం మాకవరం పంచాయతీ మేబాలో మహిళా భద్రత, బాల్య వివాహాల నిర్మూలన, గంజాయి నివారణపై అవగాహన కార్యక్రమం జరిగింది. 'మహిళా భద్రత మన అందరి బాధ్యత' అనే నినాదంతో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ఫిర్యాదుల కమిటీ జిల్లా చైర్‌పర్సన్ కృష్ణకుమారి అధ్యక్షత వహించారు. బాల్య వివాహాల వల్ల బాలికల భవిష్యత్తు దెబ్బతింటుందని, యువత గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్