నక్కపల్లి మండలంలోని జానకయ్య పేటకు సమీపాన హెటిరో రోడ్డు నుంచి వస్తున్న 6 అక్రమ గ్రావెల్ ట్రాక్టర్లను బుధవారం పట్టుకున్నట్టు సీఐ కె. కుమారస్వామి చెప్పారు. జానకయ్య పేట గ్రామం నుంచి ఎటువంటి అనుమతుల్లేకుండా అక్రమంగా గ్రావెల్ తవ్వి ట్రాక్టర్లలో తరలిస్తుండగా పట్టుకున్నామని చెప్పారు. తదుపరి చర్యలు నిమిత్తం ఎమ్మార్వోకు సమాచారం అందజేశామన్నారు.