పాయకరావుపేట నియోజకవర్గంలోని కోటవురట్ల మండలం గొట్టివాడ పంచాయతీ పరిధిలోని అణుకు గ్రామంలో విద్య, వైద్య, రోడ్డు సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సిపిఎం మండల కార్యదర్శి డేవిడ్ డిమాండ్ చేశారు. సోమవారం గ్రామ ప్రజలు, విద్యార్థులతో కలిసి నిరసన తెలిపారు. గిరిజనులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.