పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామ మత్స్యకారులు బల్క్ డ్రగ్ పార్క్ ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 6న చేపట్టిన కార్యక్రమానికి అనుమతి లేకుండా సాగుతున్నదని పేర్కొంటూ నక్కపల్లి తహశీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ మండల నాయకుడు వీసం రామకృష్ణ మద్దతు తెలిపారు.