హిందూ-ముస్లిం ఐక్యత కోసం జైభారత్ ర్యాలీ

కోటవురట్ల మండలం, రాట్నలపాలెం గ్రామంలో జైభారత్ ఆధ్వర్యంలో 'జైహో జైహో హిందూ-ముస్లిం ఏక్ హో' సమైక్యతా ర్యాలీ నిర్వహించారు. గాంధీజీ విగ్రహం వద్ద శాంతి ప్రతిజ్ఞ చేసి, ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. జైభారత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు రమణ, త్రిమూర్తులు మాట్లాడుతూ, హిందూ-ముస్లిం ఐక్యత కోసం మహనీయులు చూపిన మార్గంలో అందరూ సమానత్వంతో జీవించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్