నక్కపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మెగా పేరెంట్-టీచర్స్ మీట్‌లో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నాయకత్వంలో విద్యా ప్రమాణాలు పెరుగుతున్నాయని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను సత్కరించి, తల్లిదండ్రులు, విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం నిర్వహించారు.