నక్కపల్లిలోని మంత్రి కార్యాలయంలో క్యాంప్ కార్యాలయంలో దార్లపూడి బాబ్జి - లక్ష్మీ దంపతులకు జీవనోపాధి కోసం రెండు జెర్సీ ఆవులు, ఆవుల పోషణకు నగదు అందజేశారు. ‘జీరో పావర్టీ - P4 మార్గదర్శి - బంగారు కుటుంబం’ కార్యక్రమంలో భాగంగా ఈ సహాయం అందించారు. బాబ్జి కుమారుడు రూపస్ చదువుకు ఖర్చులు భరించనున్నట్లు, త్వరలో ట్రై మోటార్ సైకిల్ అందిస్తామని హోం మంత్రి తెలిపారు. అండగా నిలిచినందుకు కుటుంబం ధన్యవాదాలు తెలిపారు.