అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వెదుళ్ల పాలెం సమీప జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. టిఫిన్ కోసం హోటల్‌కు వెళ్తున్న తూర్పుగోదావరి జిల్లా గోకవరానికి చెందిన మందపాటి ఏసును తుని వైపు వెళ్తున్న బైక్ ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కాగా ఇద్దరినీ తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఏసు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.