పాయకరావుపేట: పడవ ప్రమాదంలో మత్స్యకారుడు మృతి

వెంకటనగరం సముద్ర తీరంలో చేపల వేటకు వెళ్లిన మేరుగు అర్జున్ (38) పడవ బోల్తా పడిన ఘటనలో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. తిరుగు ప్రయాణంలో భారీ కెరటాల తాకిడితో పడవ ఒక్కసారిగా తిరగబడి, అర్జున్ దాని కిందపడి గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించే సమయంలో మార్గమధ్యలోనే మృతిచెందాడు. ఆయన భార్యకు క్యాన్సర్, ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. గ్రామస్థులు ప్రభుత్వం సహాయం కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్