పాయకరావుపేట మంగవరం రోడ్డులోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో గురువారం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం జరిగింది. మాజీ జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ తోట నాగేశ్, టీడీపీ మండలాధ్యక్షుడు చించలపు పద్దు, టౌన్ అధ్యక్షుడు వరహాలబాబు పాల్గొన్నారు. ఎండిఓ మజ్జూరి నారాయణరావు, స్కూల్ చైర్మన్ చిరుకూరి కుమారి, మలిపెద్ది వెంకటరమణ, జనతా శ్రీను, చిరుకూరి పేర్రాజు, దాసరి శ్రీను, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులకు పలు రకాల పోటీలను నిర్వహించారు.