బంజరు భూమి పట్టాల కోసం నిరుపేదల ధర్నా

కోటవురట్ల రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 316 లో బంజరు భూమి సాగులో ఉన్న నిరుపేదలకు పట్టాలు ఇప్పించాలని సీపీఎం మండల కార్యదర్శి డేవిడ్ రాజు డిమాండ్ చేశారు. సోమవారం కోటవురట్ల తాసిల్దార్ కార్యాలయం వద్ద భూమి సాగుదారులతో కలిసి ధర్నా నిర్వహించి, తహసిల్దార్ తిరుమల బాబుకు వినతిపత్రం అందించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం కార్యవర్గ సభ్యులు, నిరుపేదలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్