సింహాచంలో ఘనంగా స్వర్ణ పుష్పార్చన

సింహాచల క్షేత్రంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారికి గురువారం శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన సేవ జరిగింది. ఆలయ ఈఓ ఆదేశాల మేరకు, శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి, 108 బంగారు పుష్పాలతో అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్