సబ్బవరం మండలం అమ్ములపాలెం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో షేక్ రెహమాన్ (27) అనే యువకుడు మృతి చెందారు. సబ్బవరం నుంచి స్వగ్రామం బలిజపాలెం వెళుతుండగా ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన రెహమాన్ అక్కడికక్కడే మరణించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.