అనకాపల్లి: మహిళ దారుణ హత్య

అనకాపల్లి జిల్లా పెందుర్తిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన ఆలస్యంగా బయటపడింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దేవి విజయనగరానికి చెందిన శ్రీనివాస్ అక్కడ ఒక గదిని అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. శనివారం రాత్రి ఇద్దరి మధ్య జరిగిన తీవ్రమైన వాగ్వాదంలో శ్రీనివాస్ ఆమెను కుర్చీతో కొట్టి హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల రైస్ పుల్లింగ్ కేసులో శ్రీనివాస్ అరెస్టైనా విషయం కూడా పోలీసులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్