చీడికాడ మండలం దండిసురవరంలో శుక్రవారం నిర్వహించిన "సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు. గ్రామంలో పర్యటిస్తూ ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి సమస్యలు గుర్తిస్తామని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వివరాలు తెలియజేశారు. గ్యాస్ సబ్సిడీ రాలేదని కొందరు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.