ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి దేవాదాయ శాఖ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించగా, అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు, జిల్లా కలెక్టర్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.