పెందుర్తి- గోపాలపట్నం స్టేషన్ల మధ్య రైలు పట్టాలపై వ్యక్తి మృతి

పెందుర్తి-గోపాలపట్నం మధ్య రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఉదయం 9:30 గంటల సమయంలో 30-35 ఏళ్ల వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. మృతుడు సుమారు 5.2 అడుగుల ఎత్తు, తెలుపు షర్ట్, నలుపు ప్యాంటు ధరించి ఉన్నాడని, ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్