నక్కపల్లి: బీభత్సం సృష్టించిన లారీ

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో లారీ అదుపు తప్పి వేగంగా కాగిత టోల్ ప్లాజాను ఢీకొని బీభత్సం సృష్టించింది. విశాఖ నుంచి కాకినాడ వైపుగా వెళ్లే లారీ ఒక్కసారిగా మొదటి కౌంటర్ నుంచి రెండో కౌంటర్‌పైకి దూసుకెళ్లింది. టోల్ వసూలు జరుగుతుండగా ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్