చేపలవేట సాగిస్తుండగా ఎర్రి అప్పన్న అనే ఓ మత్స్యకారుడు మృతి చెందాడు. పరవాడ మండలం తిక్కవానిపాలెం గ్రామానికి చెందిన దూడ ఎర్రి అప్పన్న (60) మరో ఆరుగురు మత్స్యకారులు శుక్రవారం ఉదయం 5 గంటలకు తెప్పపై చేపలవేటకు బయలుదేరి వెళ్లారు. సముద్రంలో చేపలవేట సాగిస్తున్న క్రమంలో అప్పన్న బోటులో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. అకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. సహచరులు మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకొచ్చారు.