అనకాపల్లిలో ‘మన ఊరు–మన జెండా’

బీజేపీ ఆవిర్భావ వారోత్సవాల్లో భాగంగా, మంగళవారం లక్ష్మీదేవిపేట, మార్టూరు గ్రామాల్లో "మన ఊరు–మన జెండా" కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ సి. ఎం. రమేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జెండాను ఆవిష్కరించి, రాబోయే ఆరు నెలల్లో గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు. అనకాపల్లి జిల్లాకు ప్రధాని మోడీ నాయకత్వంలో రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, యువత ఉపాధి కోసం ప్రతి నెలా ఒక పరిశ్రమ వచ్చేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. మార్టూరులో యువత కోసం జిమ్ ఏర్పాటుకు ఎంపీ నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్