పెందుర్తి: ఆరోగ్యకరమైన ఆవకాయ తయారీపై అవగాహన సదస్సు

పెందుర్తి మండలం పెద్దగాడిలోని సంకల్ప కళా గ్రామంలో ఆదివారం ఆవకాయ పచ్చడి తయారీ మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ‘సేవ్’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు విజయరాం మాట్లాడుతూ, సంప్రదాయ ఆవకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, ప్రకృతి ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులను, బయో క్లింజర్లను మాత్రమే వాడాలని సూచించారు. పచ్చడి తయారీ నిపుణులు పేరిచర్ల విశ్వనాథ రాజు ఆవకాయను శాస్త్రీయంగా, ఆరోగ్యకరంగా తయారు చేసే పద్ధతులను వివరించారు. విదేశీ క్లింజర్లకు బదులుగా సహజ సిద్ధమైన వాటినే ఉపయోగించాలని సంస్థ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయదారులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్