విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పేదలకు కొండంత అండగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. బుధవారం పెందుర్తి జోన్ 96వ వార్డు రాతి చెరువు ప్రాంతంలో లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని కొనియాడారు. జనవరి నెలకు సంబంధించిన పింఛన్లను డిసెంబర్ 31న ఒకరోజు ముందుగానే పంపిణీ చేయడం ద్వారా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.