ప్రకృతితో మమేకమై పర్యావరణ హితంగా జీవించాలని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం పిలుపునిచ్చారు. శనివారం పెందుర్తి మండలం పెద్దగాడి వద్దగల ‘సంకల్ప కళా గ్రామం’లో భీమిలి ఎస్ఓఎస్ విద్యార్థులతో కలిసి ఆయన విత్తన బంతులు, గోళీలు తయారు చేయించారు. శీతోష్ణస్థితి వేడెక్కకుండా ఉండాలంటే కొండలు, తీరప్రాంతాల్లో విత్తన బంతులు చల్లాలని, డ్రోన్లతో చల్లేందుకు వీలుగా 6 మిల్లీమీటర్ల సైజులో విత్తన గోళీలు తయారు చేయించడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. సంకల్ప కళా గ్రామం అద్భుతమైన పర్యాటక ప్రదేశమని కొనియాడారు.