పెందుర్తి; అనకాపల్లి కార్యాలయానికి పెందుర్తి సంతకాలు తరలింపు

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెందుర్తి నియోజకవర్గంలో సేకరించిన సంతకాల పుస్తకాలను బుధవారం పెందుర్తి కార్యాలయం నుంచి అనకాపల్లి జిల్లా కార్యాలయానికి తరలించారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన "కోటి సంతకాల ప్రజా ఉద్యమం"లో భాగంగా సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెందుర్తి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఆధ్వర్యంలో ఈ సంతకాల పుస్తకాలను అనకాపల్లి జిల్లా కార్యాలయానికి అందజేశారు.

సంబంధిత పోస్ట్