సబ్బవరం మండలంలోని వంగలి మారిటైమ్ యూనివర్శిటీ మెయిన్ గేట్ వద్ద ఆ గ్రామ రైతులు గురువారం ఆందోళనకు దిగారు. భూములు ఇచ్చినప్పుడు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని యాజమాన్యం హామీ ఇచ్చిందని, కానీ అది అమలు కావడం లేదని ఆరోపించారు. పలుమార్లు ఎమ్మెల్యే, యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదన్నారు. హామీ నిలబెట్టుకోకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు.