పెందుర్తి: శేష వాహనంపై గోవిందరాజ స్వామి వైభవం

సింహాచల వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా, శ్రీ గోవిందరాజ స్వామి వారు ఉభయ దేవేరులతో కలిసి శేష వాహనంపై మాడవీధుల్లో విహరించారు. ఆలయ ఈఓ జల్లేపల్లి వెంకట్రావు ఆదేశాల మేరకు, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, సీతారామాచార్యుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణలు, నాదస్వర వాయిద్యాల నడుమ ఈ తిరువీధి సేవ అత్యంత వైభవంగా జరిగింది. భక్తుల కోలాట ప్రదర్శనలు ఈ ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలో ఆలయ అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్