మైనార్టీ మోర్చా మహిళా ఉపాధ్యక్షురాలిగా షేక్ సయ్యద్ బేబీ ఎన్నిక

అనకాపల్లి జిల్లా మైనార్టీ మోర్చా నూతన కమిటీ ఏర్పాటులో భాగంగా శనివారం ఎంపీ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యలమంచిలి మున్సిపాలిటీకి చెందిన షేక్ సయ్యద్ బేబీ అనకాపల్లి జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చా మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీలో తనకు లభించిన గుర్తింపుపై హర్షం వ్యక్తం చేస్తూ, పార్టీ ఆశయాల సాధనకు క్షేత్రస్థాయిలో మరింత కృషి చేస్తానని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్