విశాఖపట్నంలోని షాపియార్డ్ ఉద్యోగి కుటుంబం ఒక వింత అనుభవాన్ని ఎదుర్కొంది. వారు తమ క్వార్టర్స్‌లోకి మారే క్రమంలో రిఫ్రిజిరేటర్‌ను ఖాళీ చేసినప్పుడు, ఫ్రిడ్జ్ లోపలి నుంచి ఏదో తొంగి చూస్తున్నట్లు గుర్తించారు. మొదట బల్లి అనుకుని తరిమేయడానికి ప్రయత్నించగా, అది పాము అని తెలిసి భయపడ్డారు. వెంటనే స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం అందించారు. ఆహారం లేదా ఆవాసం కోసం పాములు జనావాసాల్లోకి వస్తున్నాయని ఈ సంఘటన తెలియజేస్తోంది.