అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం తారువ గ్రామంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన 3.0 పథకం కింద 9 కుటుంబాల మహిళలకు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చేతుల మీదుగా ఉచిత గ్యాస్ కనెక్షన్లు గురువారం పంపిణీ చేశారు. ఎక్స్ ఎంపీపీ కిలపర్తి భాస్కర రావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకం ద్వారా మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.