విశాఖ: కమనీయం.. అప్పన్న కల్యాణం

విశాఖ జిల్లా సింహాచలంలో ఆదివారం రాత్రి శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ఉత్తర రాజగోపురం ఎదుట ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలతో కలిసి సంప్రదాయబద్ధంగా కల్యాణం నిర్వహించారు. కల్యాణోత్సవానికి ముందు సింహగిరి మాడ వీధుల్లో స్వామివారి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించగా, భారీగా భక్తులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తలంబ్రాలు, ప్రసాదం పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్