గ్రామీణ ప్రాంతాలను పట్టణీకరణ దిశగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని వీఎంఆర్‌డీఏ చైర్మన్ ఎం. వి. ప్రణవ్ గోపాల్ తెలిపారు. అథారిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నర్సీపట్నం, విజయనగరం వంటి మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కోసం నిధులు కేటాయించినట్లు చెప్పారు. గాజువాకలో రూ. 9 కోట్లతో స్పోర్ట్స్ విలేజ్, మూడు నెలల్లో సెంట్రల్ పార్క్‌లో యాంటీ డ్రగ్ పార్క్ నిర్మిస్తామన్నారు. భోగాపురం రహదారులను త్వరితగతిన పూర్తి చేయాలని, మే 9న కైలాసగిరిపై త్రిశూల్ ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ భూముల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.